డాక్టర్ టి జీవన్ రావుకు సన్మానం..

డాక్టర్ టి జీవన్ రావుకు సన్మానం..

కుంటాల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సర్జరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైయ్యారు కుంటాల మండలంలోని అంబకంటి వాసి టీ జీవన్ రావు. ఆయన నిజామాబాద్ జిల్లాలో ఉంటూ వైద్యుడిగా పని చేస్తున్నారు. అయితే.. టీ జీవన్ రావును బీజేపీ నాయకులు జీవి రమణారావు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శాలువా పుష్పగచాలతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మెరుగైన సేవలు అందించాలని.. పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేయాలని.. పేద ప్రజలకు ఉన్నతమైన వైద్యం అందించాలని ఆయన ఆకాంక్షించారు. టీ జీవన్ రావు రాష్ట్ర సర్జరీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply