Tribute | వివేకానంద స్ఫూర్తితో మెలగాలి…

Tribute | వివేకానంద స్ఫూర్తితో మెలగాలి…
Tribute | ఆంధ్రప్రభ, పాలమూరు : ప్రపంచ స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద ఆశయ సాధన కోసం యువత కట్టుబడి ఉండాలని నవాబుపేట మండలం పరిధిలోని గ్రామ పెద్దలు సూచించారు. ఇవాళ స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి ఉత్సవాల్లో భాగంగా మరికల్ స్వామి వివేకానంద చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
