ఆదివాసి సంప్రదాయాలు భావితరాలకు అందించాలి
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా(Asifabad District) జై నూర్ మండలంలో మంగళవారం అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి(Kovalakshmi) పలు గ్రామాల్లో పర్యటించారు. ఆదివాసిగూడలో జరుగుతున్న గుస్సాడీ దండారి సంబరాల్లో భాగంగా ఆమె రాసిమెట్ట, భూసి మెట్ట దేవుగూడ, జంగాం గ్రామాల్లో జరిగిన దండారి సంబరాల్లో పాల్గొని మహిళలతో దండారి నృత్యాలు చేసి అలరింపజేశారు. ఆయా గ్రామాల్లో దండారీల ఆశీస్సులు తీసుకున్నారు.
దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. దండారీలకు కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మాట్లాడుతూ.. ఆదివాసీల సాంప్రదాయాలను భావితరాలకు అందే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. గుస్సాడీ దండారి లా(Gussadi Dandari Law) వేడుకలను ప్రభుత్వం గుర్తించడం జరిగిందని ఆమె అన్నారు.
ఈ వేడుకల్లో బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇంతియాజులాల, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షులు మడవి భీమ్రావు(Madavi Bheem Rao), ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు కుమ్ర భగవంతరావు, తాజా మాజీ సర్పంచులు, బిఆర్ఎస్ నాయకులు, ఆదివాసీ నాయకులు ఆదివాసీలు పాల్గొన్నారు.