Mahbubabad | న్యాయం చేయాలంటూ…

Mahbubabad | న్యాయం చేయాలంటూ…
Mahbubabad | మహబూబాబాద్, ఆంధ్రప్రభ : సంవత్సరాలు గడుస్తున్నా.. తనకంటూ న్యాయం జరగట్లేదని భూపతిపేట గ్రామానికి చెందిన గిరిజనుడు సెల్ టవర్ (cell tower) ఎక్కి నిరసనకు దిగారు. ఈ సంఘటన సోమవారం గూడూరు మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి…
గూడూరు మండలం (Gudur Mandal) లోని భూపతిపేట గ్రామ శివారు కూకట్ పల్లి తండాకు చెందిన ధర్మ సోత్రం రవికుమార్ తన ఇంటికి వెళ్లడానికి దారి లేక గత కొన్ని సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో సంప్రదించినా.. పోలీసులు భూమి విషయంలో పంచాయతీ చేయమని, గ్రామంలో చేసుకోవాలని చెప్పడం జరిగింది. దీంతో పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీ చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆగ్రహానికి గురై గూడూరులోని బీఎస్ఎన్ఎల్ టవర్ (BSNL Tower) ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి హుటాహుటిన అక్కడకు చేరుకొని టవర్ పై నుంచి దిగాలని బాధితున్ని కోరారు. తనకు న్యాయం జరిగేంత వరకు కిందికి దిగేది లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు బాధితుడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
