Treatment | భీమ్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే…

Treatment | భీమ్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే…

Treatment | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం పులుమామిడి గ్రామ మాజీ సర్పంచ్ పి. భీమ్ రెడ్డిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ రోజు పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఇంట్లోనే చికిత్స(treatment) పొందుతున్న భీమ్ రెడ్డి యోగక్షేమాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.

భీమ్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో చర్చించారు. మెరుగైన వైద్యం అందించాలని, ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ(Constituency) అభివృద్ధిలో చురుగ్గా పాల్గొన్న భీమ్ రెడ్డి త్వరగా కోలుకుని తిరిగి ప్రజా సేవలోకి రావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Leave a Reply