Transport | సీపీఎం అభ్యర్థులను గెలిపించండి

Transport | సీపీఎం అభ్యర్థులను గెలిపించండి

Transport | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండల కేంద్రంలో అమరవీరుల స్మారక భవనంలో ఈ రోజు జరిగిన సీపీఎం(CPM) మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగారపు పాండు పాల్గొని మాట్లాడుతూ… ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పట్ల అంకితభావంతో పనిచేసే సీపీఎం పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించిన వారు అవుతారన్నారు.

ఇండ్లు, ఇండ్ల‌స్థలాలు(Houses, Homesteads), రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, బోనస్ చెల్లించాలని వ్యవసాయ సీజన్లో రైతులకు కావలసిన ఎరువులన్నీ సొసైటీల ద్వారా అందుబాటులో నుంచి విపత్తులు ఏర్పడినప్పుడు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామాలలో ప్రజల మధ్య సోదరి ఐక్యతాభావం ఏర్పడాలన్నారు. గ్రామాల అభివృద్ధి జరగాలని గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం(Transport facility) ఆర్టీసి బస్సులను గ్రామంలోకి వచ్చే విధంగా వీటితోపాటు ప్రజల సౌకర్యాల కొరకు నిరంతరం పోరాటం చేస్తాన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి బ్రహ్మం, మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్, మండల కమిటీ సభ్యులు తంగెళ్ల వెంకట చంద్ర, పిన్నపరెడ్డి, వెంకటరెడ్డి, చందాల బిక్షం, షేక్ ఖాసిం, సిద్దుల వెంకటయ్య, ఎల్లంశెట్టి వీరస్వామి, మాడూరి నరసింహచారి పాల్గొన్నారు.

Leave a Reply