ట్రాన్సఫార్మర్ టెన్షన్..

ట్రాన్సఫార్మర్ టెన్షన్..
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ విద్యుత్ శాఖ పరిధిలోని నవాబ్‌పేట మండలం చిట్టిగడ్డ రైల్వే స్టేషన్ సమీపంలో విద్యుత్ స్తంభాలకు చెట్ల తీగలు పెనవేసుకుని ప్రమాదకర పరిస్థితి నెలకొంది. సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు కూడా చెట్ల తీగలు పూర్తిగా అల్లుకుపోవడంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో విద్యుత్ లైన్లకు చెట్ల కొమ్మలు తగులుతూ ఉండటంతో షార్ట్ సర్క్యూట్ లేదా అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. వెంటనే చెట్ల కొమ్మలను తొలగించి సమస్యను పరిష్కరించాలని విద్యుత్ శాఖను కోరుతున్నారు.
ఈ విషయమై వికారాబాద్ విద్యుత్ శాఖ ఏడీఈ సత్యనారాయణ రెడ్డిని ప్రశ్నించగా, సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వికారాబాద్ పరిధిలోని గ్రామాల్లో ఎటువంటి విద్యుత్ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, తక్షణమే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుని ప్రమాదాన్ని నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
