అవినీతి ఆరోపణలతో బదిలీ వేటు !!

హైదరాబాద్, ఆంధ్రప్రభ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సికింద్రాబాద్–మహంకాళి ఏసీపీ సైదయ్యపై బదిలీ వేటు పడింది. ఆయనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు చేపట్టారు. సైదయ్యను సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గోపాలపురం ఏసీపీకి మహంకాళి ఏసీపీగా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
