హైదరాబాద్ – తెలంగాణ పోలీసు శాఖ లో బదిలీ పర్వం కొనసాగుతోంది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 మంది ఏఎస్పీ లను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ మధ్యాహ్నం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రెండు రోజుల క్రితమే 77 మంది డీఎస్పీ లు, అదేవిధంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో 27 మంది ఏసీపీ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజాగా నేడు 30మంది ఎసిపిలకు స్థాన చలనం కలిగించారు..
Transfer | తెలంగాణలో 30 మంది ఏఎస్పీల బదిలీ
