రోడ్డు ప్రమాదంలో….

గొల్లపల్లి: జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండల కేంద్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో గొల్లపల్లి మండలం గోవిందపల్లెకు చెందిన అల్లూరి రాఘవరెడ్డి, వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన బిదారి శ్రీకాంత్ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

మరణించిన అల్లూరి రాఘవరెడ్డి భార్య అల్లూరి సుగుణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే సీఐ రామ్ నరసింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, వివరాలను సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply