విజయనగరం ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా వినాయ ఊరేగింపు(Vinaya procession) వేడుకల్లో విషాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం రాత్రి విజయనగరం(Vizianagaram) జిల్లాలోని వినాయ చవితి వేడుకల్లో విషాదం(Tragedy) జరిగింది. విజయనగరంలో జిల్లా బొబ్బాదిపేట(Bobbadipet) గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా కమిటీ సభ్యులు డీజే(DJ)ను ఏర్పాటు చేశారు.
గ్రామానికి చెందిన బొబ్బాది హరీశ్(Bobbadi Harish)(22) అనే యువకుడు డీజే ముందు డ్యాన్స్(Dance) చేశాడు. ఆ శబ్దానికి తట్టుకోలేక ఒక్కసారిగా కిండపడి కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి స్నేహితులు యుకుడిని పట్టణంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

