హైదరాబాద్ – అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్‌డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఇందిరామహిళాశక్తి కార్యక్రమం నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ వైపు ఉన్న దారు ల్లో ఆంక్షలు విధిస్తున్నామని, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటలవరకు ఈ ఆంక్షలు వర్తిసాయని పేర్కొన్నారు. టివోలి క్రాస్ రోడ్స్ నుంచి ప్లాజా క్రాస్ రోడ్స్ వరకు మీటింగ్ సమయంలో రోడ్డు బంద్ చేస్తామని , వాహనదారులు పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్స్-బేగంపేట-సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు ట్రాఫిక్ ఆంక్షల సమయంలో ప్రయాణించవద్దని సూచించారు.
చిలకలగూడ క్రాస్ రోడ్స్, ఆలుగడ్డబావి క్రాస్‌రోడ్, సంగీత్ క్రాస్‌రోడ్, వైఎంసీఏ క్రాస్‌రోడ్, ప్యాట్నీక్రాస్‌రోడ్, ఎస్‌బీహెచ్ క్రాస్‌రోడ్, ప్లాజా, సీటీఓ జంక్షన్, బ్రూక్‌బాండ్ జంక్షన్, టివోలి జంక్షన్, స్వీకార్‌ఉప్‌కార్ జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్, త్రిముల్‌ఘరీ క్రాస్‌రోడ్స్, తాడ్‌బంద్ క్రాస్‌రోడ్, సెంటర్‌పాయింట్, డైమండ్ పాయింట్, బోయిన్‌పల్లి క్రాస్‌రోడ్, రసూల్‌పురా జంక్షన్, బేగంపేట, పారడైజ్ జంక్షన్లలో అధికరద్దీ ఉండే అవకాశమున్నందున ప్రజలు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎంజీ రోడ్, ఆర్పీ రోడ్, ఏడీ రోడ్‌లలో ప్రయాణించవద్దని సూచించారు. ఆలుగడ్డ బావి , సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సంగీత్ క్రాస్ రోడ్ వైపు క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ మీదుగా మళ్లిస్తామని తెలిపారు.
తుకారాంగేట్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయింట్ జాన్స్ రోటరీ వైపు సంగీత్, క్లాక్ టవర్, ప్యాట్నీ, పారడైజ్ మీదుగా మళ్లిస్తామని, సంగీత్ క్రాస్ రోడ్స్ నుంచి బేగంపేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను వైఎంసీఏ నుంచి క్లాక్ టవర్‌వైపు ప్యాట్నీ, పారడైజ్, సీటీఓ, రసూల్‌పుర నుంచి బేగంపేటవైపుకు మళ్లిస్తామని చెప్పారు. బేగంపేట నుంచి సంగీత్ క్రాస్ రోడ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను బలామ్‌రాయి, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్‌ఉప్‌కార్, వైఎంసీఏ, సెయింట్‌జాన్స్‌రోటరీ నుంచి సంగీత్‌వైపు మళ్లిస్తారు. బోయిన్‌పల్లి, తాడ్‌బంద్ నుంచి టివోలి వైపుకు బ్రూక్ బాండ్ మీదుగా సీటీఓ, రాణిగంజ్, టాంక్ బండ్‌మీదుగా మళ్లిస్తారు .
కార్ఖానా, జేబీఎస్ నుంచి ఎస్‌బీహెచ్ ప్యాట్నీ వైపు వెళ్లే వాహనాలను స్వీకార్ ఉప్‌కార్ వద్ద వైఎంసీఏ, క్లాక్‌టవర్, ప్యాట్నీ మీదుగా టివోలి వైపు మళ్లిస్తారు. ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలను స్వీకార్‌ఉప్‌కార్ ఎస్‌బీహెచ్ వైపుకు రానీయమని, క్లాక్‌టవర్, వైఎంసీఏ, సీటీఓవైపు మళ్లిస్తారని తెలిపారు. ఆర్టీఏ ట్రిముల్‌ఘరీ, కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్‌గూడనుంచి ప్లాజా వైపు వెళ్లే వాహనాలను టివోలి వద్ద స్వీకార్‌ఉప్‌కార్, వైఎంసీఏ, బలంరాయ్, సీటీఓ వైపుకు మళ్లిస్తామని జోయల్ డేవిస్ తెలిపారు. గ్రేటర్ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.