గోదావరిఖని, ఆంధ్రప్రభ : రవాణా శాఖ (Transport Department) నిబంధనలు పాటించిన మహిళలకు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) చీరలు పంపిణీ చేశారు. గురువారం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ (Traffic ACP Srinivas) ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గోదావరిఖని పట్టణంలో రవాణాశాఖ నిబంధనల ప్రకారం హెల్మెట్ ధరించడంతో పాటు సీట్ బెల్టు (Seat belt) ఇతరత్రా నిబంధనలు పాటించిన మహిళలకు (womens) చీరలను బహుమతులు అందించారు.

ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రజలకు రవాణా శాఖ (Transport Department) నిబంధనలను తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రతిఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఉల్లంఘిస్తే జరిమాణాలు తప్పవ‌న్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లు, ఎస్సై లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply