నల్లమల్ల అడవిలో 3 కిలోమీటర్లు మేర ట్రాఫిక్ జామ్

నల్లమల్ల అడవిలో 3 కిలోమీటర్లు మేర ట్రాఫిక్ జామ్
- వృద్ధులు, మహిళలు, చిన్నారుల అవస్థలు
నంద్యాల బ్యూరో, సెప్టెంబర్ 24, ఆంధ్రప్రభ : నంద్యాల (Nandyal) నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు వెళ్లే జాతీయ రహదారిపై బుధవారం ఉదయం 12 గంటలకు ఓ లారీ బ్రేక్ ఫెయిల్ (Lorry brake failure) అయి రోడ్డుపైనే అడ్డంగా నిలిచిపోయింది. లారీని ఎటు కదిలించలేని పరిస్థితి నెలకొంది. దీంతో నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే రహదారిలోనూ అటు నుంచి వచ్చే వాహనాలు సుమారు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు వృద్ధులు మహిళలు తిండి కోసం తాగునీటి కోసం పాల కోసం అనేక అవస్థలు ఎదుర్కొన్నారు.
సమాచారం అందుకున్న నంద్యాల జిల్లా మహానంది (mahanadhi) పోలీసులు, ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. వారు ఇరుపక్కల ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించినందుకు కష్టపడ్డారు. ప్రొక్లైన్ తెచ్చి బ్రేక్ డౌన్ అయిన లారీని పక్కకు తప్పించారు. ఎట్టకేలకు రెండు గంటలు కష్టపడి పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ జాతీయ రహదారిపై ఏ ఒక్క చిన్న వాహనం నిలిచిపోయిన గంటలు తరబడి ట్రాఫిక్ జామ్ (Traffic Jam) కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనంతపూర్ టు అమరావతి నాలుగు లైన్ల జాతీయ రహదారి ఏర్పరచడానికి ప్రభుత్వం అనుమతినిచ్చినప్పటికీ ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడం విశేషం. ఈ పనులు త్వరగా చేపడితే ప్రయాణికుల కష్టాలు తీరుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.
