హెల్మెట్ స్ట్రాప్ బిగిస్తేనే పూర్తి రక్షణ

హెల్మెట్ స్ట్రాప్ బిగిస్తేనే పూర్తి రక్షణ

డీసీపీ షరీన్ బేగం

విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం పర్యవేక్షణలో హెల్మెట్ల పై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న విషయము తెలిసినదే. ఈ క్రమంలో, సత్యనారాయణపురం త్రీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కే కిషోర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ అవగాహన ఫ్లాష్ మాబ్ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణనష్టం తలకు గాయాల వల్లనే జరుగుతుందని పేర్కొన్నారు.

హెల్మెట్ కేవలం జరిమానా తప్పించుకునేందుకు కాదు, ప్రాణాలను కాపాడుకోవడానికి ధరించాలని, హెల్మెట్ ధరించడం మాత్రమే సరిపోదు, దాని స్ట్రాప్‌ను సక్రమంగా పెట్టుకోవాలని. అప్పుడు మాత్రమే ప్రమాద సమయంలో పూర్తి రక్షణ లభిస్తుందని ఆమె అన్నారు అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని, యువత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల లక్ష్యం కేసులు నమోదు చేయడం కాదని, ప్రజల్లో బాధ్యతా భావం పెంపొందించడం అని చెప్పారు.

ఆదిత్య కళాశాల విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హెల్మెట్ ధరించి ఫ్లాష్ మాబ్ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని డీసీపీ షిరీన్ బేగం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో , ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామారావు, మహిళా ఎస్ఐ సరళ, పోలీసు సిబ్బంది, ఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్ వీర్రాజు, నృత్య రూపకర్త స్వామి, ఆదిత్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply