ట్రాక్టర్ ఢీ.. ఒకరి మృతి. …

ట్రాక్టర్ ఢీ.. ఒకరి మృతి. …
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : బైపాస్ రోడ్ లో రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల ప్రకారం మచిలీపట్నం లక్ష్మణాపురానికి చెందిన భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పదవీ విరమణ చేసిన పీటర్ మత్తె (70) అనే వృద్ధుడు ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. మూడు స్తంభాల సెంటర్ నుండి వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ సైకిల్ పై వెళ్తున్న వృద్ధుడు ను ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయాడు.
కేసు నమోదు చేసిన చిలకలపూడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతుని సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
