TPCC | కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి..

TPCC | కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి..

అభివృద్ధిని చూడండి..
TPCC |
పెద్దవంగర, ఆంధ్రప్రభ : సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇవాళ‌ మేజర్ గ్రామపంచాయతీ పెద్దవంగర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ముద్దసాని పారిజాతం సురేష్ తరుపున టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

గ్రామ ప్రజలు డప్పు చప్పుళ్ళతో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని, బ్యాట్ గుర్తుకు ఓటు వేసి మండల కేంద్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా చూడాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి కోరారు. ఈనెల 14వ‌ తేదీన జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply