Toxic | యశ్ ఎంట్రీ అదిరింది..

Toxic | యశ్ ఎంట్రీ అదిరింది..
Toxic | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కన్నడ స్టార్ హీరో యష్ టాక్సిక్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని లేడీ డైరెక్టర్ (Lady Director) గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తుంది. యష్ బర్త్ డే సందర్భంగా టాక్సిక్ సినిమా నుంచి యష్ చేసిన రయ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మూవీ గ్లింప్స్ అంటూ రిలీజ్ చేసిన ఈ ప్రోమోలో యష్ ఎంట్రీ అదిరిపోయింది. అయితే.. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మాత్రం షాక్ ఇచ్చిందని చెప్పచ్చు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. గీతూ ఏం చేసింది..?
Toxic | ఎలాంటి మొహమాటాలు లేకుండా..
ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో యష్ క్యారెక్టర్ ను పరిచయం చేశారు. ఈ ప్రోమోలో కొన్ని ఎలిమెంట్స్ సర్ ప్రైజ్ చేసేలా ఉన్నాయి. కేజీఎఫ్ రెండు చిత్రాలతో యష్ కు వచ్చిన యాక్షన్ ఇమేజ్ ను మరింత ముందుకు తీసుకెళ్లేలా టాక్సిక్ సినిమా (Toxic Movie) ఉండబోతోంది. ఆయన క్యారెక్టర్ ఎంట్రీని చూపించిన విధానంతోనే టాక్సిక్ సినిమాలో ఏ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయో తెలుస్తోంది. యాక్షన్ తో పాటు కేజీఎఫ్ లో ఎక్కడా కనిపించని రొమాంటిక్ యాంగిల్ కూడా ఈ మూవీలో చూపిస్తున్నారు. లేడీ డైరెక్టర్ అయినా గీతూ మోహన్ దాస్ డేరింగ్ గా ఒక టెక్నీషియన్ లా ఎలాంటి మొహమాటాలు లేకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Toxic | సర్ ప్రైజింగ్ నెంబర్స్..
అయితే.. లేడీ డైరెక్టర్ అయ్యుండి.. షాకింగ్ గా అనిపించేలా రొమాంటిక్ యాంగిల్ చూపించడం నిజంగా షాకే. ఇదో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 19న రిలీజ్ కు (Release) రాబోతోంది. కన్నడ నాట ఈ సినిమాకు (Movie) భారీ క్రేజ్ ఉండగా, మిగతా అన్ని భాషల్లోనూ మంచి ఓపెనింగ్స్ రాబట్టేలా కనిపిస్తోంది. టాక్ బాగుంటే మాత్రం.. టాక్సిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద సర్ ప్రైజింగ్ నెంబర్స్ క్రియేట్ చేయొచ్చు. కొన్నేళ్లుగా యష్ ను బిగ్ స్క్రీన్ మీద మిస్సయిన అభిమానులకు ఆ కొరత టాక్సిక్ మూవీతో తీరనుంది. చూడాలి మరి.. టాక్సిక్ ఎంత వరకు మెప్పిస్తుందో.. ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో..?

