Top Story | ప‌చ్చ బొట్టుతో క్యాన్స‌ర్ ముప్పు

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : యువ‌తీయువ‌కులు ప‌చ్చబొట్టు పొడిపించుకుంటుంటారు. ఒక‌ప్పుడు ప‌ల్లె ప్రాంతానికి ప‌రిమిత‌మైన ప‌చ్చ‌బొట్టులు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌లు కావ‌డంతో వాటిపై యువ‌త‌కు ఆస్త‌కి పెరిగింది. అయితే ప‌చ్చ‌బొట్టు పొడిపించుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని విదేశీయ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ప‌చ్చ‌బొట్టు వ‌ల్ల‌ క్యాన్సర్ ముప్పు 33% నుంచి 62% వరకూ ఎక్కువగా ఉంటున్నట్టు డెన్మార్క్ పరిశోధకులు వెల్ల‌డించారు. ఇటీవ‌ల నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది.


సైజును బ‌ట్టీ ప్ర‌మాద తీవ్ర‌త ఉంటుంది…
ప‌చ్చ‌బొట్టులు సైజ్‌ను బ‌ట్టీ ప్ర‌మాద తీవ్ర‌త ఉంటుంది. పెద్ద పచ్చబొట్లతో ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటున్నట్టూ వెల్లడైంది. అరచేతి కన్నా పెద్ద సైజు పచ్చబొట్లతో చర్మ క్యాన్సర్ ముప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అదే లింఫ్ గ్రంథులకు వచ్చే క్యాన్సర్ (లింఫోమా) ముప్పు దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. చర్మంలోకి చొచ్చుకెళ్లే పచ్చబొట్టు సిరా రేణువులు లోపలికి వెళ్లిపోవచ్చు. ఇవి లింఫ్ గ్రంథుల్లో పోగు పడొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో జన్యు, పర్యావరణ పరంగా ఒకేలాంటి అంశాలను పంచుకునే కవలలను ఎంచుకొని పరిశీలించారు. వీరిలో కొన్ని జంటల్లో ఒకరికి క్యాన్సర్ వచ్చినవారూ ఉన్నారు.


ఈ సిరా… లింప్ గ్రంథుల పనితీరుపై ప్ర‌భావం చూపుతోంది!
ప‌చ్చ‌బొట్టు సిరా… లింప్ గ్రంథుల పనితీరుపై ప్ర‌భావం చూపుతోంది. పచ్చబొట్టు పొడిపించుకోని కవలతో పోలిస్తే పొడిపించుకున్న కవలకు చర్మ. లింఫ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. ఎంత పెద్దగా. ఎంత ముందుగా పొడిపించుకుంటే అంత అధికంగా లింఫ్ గ్రంథుల్లో సిరా పోగుపడుతున్నట్టు తేలింది. శరీరం వీటిని తమకు సంబంధించినవి కావని భావిస్తుండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే రోగనిరోధక వ్యవస్థ పచ్చబొట్టు సిరా మీద నిరంతరం దాడి చేయటానికి ప్రయత్నిస్తుందన్నమాట. ఈ సిరా లింప్ గ్రంథుల పనితీరును బలహీనం చేస్తుందో లేదో, ఇతర జబ్బులకు దారితీస్తుందో లేదో ఇంకా తెలియదు. రోగనిరోధక వ్యవస్థ పచ్చబొట్టు సిరా మీద నిరంతరం దాడి చేయటానికి ప్రయత్నిస్తుందన్నమాట. ఈ సిరా లింఫ్ గ్రంథుల పనితీరును బలహీనం చేస్తుందో లేదో, ఇతర జబ్బులకు దారితీస్తుందో లేదో ఇంకా తెలియదు. అందుకే సిరా రేణువులు లింఫ్ గ్రంథుల మీద ఎలా ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకోవటానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. పచ్చబొట్టులోని కొన్ని వర్ణద్రవ్యాలు అంత ఆరోగ్యకరం కావని గత అధ్యయనాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *