tollywood heroin | గ్లామర్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల

tollywood heroin | గ్లామర్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలుగు అమ్మాయి సాయి కామాక్షి భాస్కర్ల. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీగా తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు చేస్తూ ప్రశంసలు అందుకుంది. చైనాలో ఎంబీబీఎస్ చేసి.. అపోలో ఆసుపత్రిలో కొన్నాళ్లు డాక్టర్ గా పనిచేసింది. 2018లో మిస్ తెలంగాణగా నిలిచింది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో ఆఫర్లు అందిపుచ్చుకుంది. ప్రియురాలు అనే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆపై మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష, పొలిమేర 2, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించింది. ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ.. విభిన్న క్యారెక్టర్ల చేస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంది. మా ఊరి పొలిమేర, పొలిమేర 2 మూవీస్ ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. అలాగే ఝాన్సీ, సైతాన్, దూత వంటి వెబ్ సిరీస్ కూడా చేసింది ఈ అందాల భామ. ఈ అమ్మడు ఎక్కువగా డీగ్లామర్ రోల్స్ చేసింది. కానీ నెట్టింట మాత్రం హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది.























