నేటి బాసర సరస్వతీ అమ్మవారి అవతారం
బాసర, సెప్టెంబర్ 24 ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడవ రోజైన బుధవారం సరస్వతి అమ్మవారు చంద్రఘంట అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మూడవ అవతారం చంద్రఘంటా మాత ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రాకృతిలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంటా అని పేరు వచ్చింది.
ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది. జపమాల,ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది.
భక్తుల కష్టాలను అమ్మవారు అతి వెంటనే నివారిస్తుంది. ఏవిధమైన భయాలు వారిని బందింపవు.
అమ్మవారికి అర్చకులు వేద పండితులు వేద మంత్రోచ్చారణతో పుష్పార్చన చేసి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

