మేష రాశి
చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
వృషభ రాశి
బంధువులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ధనలాభం పొందుతారు.
మిథున రాశి
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణ వత్తిడులు తొలగి ఊరట చెందుతారు. చేపట్టిన పనుల నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల, వాహనాలు నడిపే విషయాలలో నిర్లక్ష్యం తగదు. వస్తు లాభం పొందుతారు.
కర్కాటక రాశి
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
సింహ రాశి
గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. చర్చల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
కన్య రాశి
మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం తగ్గుతుంది. వ్యవవారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
తుల రాశి
చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యం పొందుతారు.
వృశ్చిక రాశి
కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.
ధనుస్సు రాశి
సన్నిహితుల నుంచి విలువైన నమాచారం అందుకుంటారు. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మకర రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. సోదరులతో ఆనందంగా గడుపుతారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి.
కుంభ రాశి
మిత్రుల నుంచి ఎదురైన ఒత్తిడులు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తు లాభం పొందుతారు.
మీన రాశి
సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కారం. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
