Today Schedule |తెలుగుదేశం మ‌హానాడులో నేటి షెడ్యూల్ ….

క‌డ‌ప – వైఎస్సార్ కడప జిల్లాలో నిన్న ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడు ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి పోటెత్తిన టీడీపీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ అభిమానులతో మహానాడు ప్రాంగణం పసుపుమయమైంది. రేపటి వరకు కొనసాగనున్న మహానాడులో నేడు రెండో రోజు అజెండాను ప్రకటించారు.

ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు యుగ పురుషుడు ఎన్టీఆర్‌కు మహానాడు ఘనంగా నివాళి అర్పించనుంది. 10.30 నుంచి 11 గంటల వరకు ‘తెలుగు జాతి-విశ్వఖ్యాతి’, 11 గంటల నుంచి 12 గంటల వరకు ‘రాష్ట్రం-విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు-రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం’, 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ‘రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ-వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ- ఉత్తరాంధ్ర అభివృద్ధి- రాయలసీమ అభివృద్ధి-రాయలసీమ డిక్లరేషన్-అమరావతి అభివృద్ధి వికేంద్రీకరణ’ వంటి అంశాలపై ప్రసంగాలు ఉంటాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.15 గంటల వరకు ‘యోగాంధ్రప్రదేశ్’, 2.15 గంటల నుంచి 2.30 వరకు ‘మౌలిక సదుపాయాల కల్పనతో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం-రహదారులు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధి’, 2.30 నుంచి 3 గంటల వరకు ‘విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు-సమగ్ర సాగునీటి ప్రణాళికతో ఉజ్వల ప్రగతి-తెలంగాణ వ్యవసాయం-సాగునీటి ప్రాజెక్టులపై చర్చ’ ఉంటుంది. 3 నుంచి 3.30 గంటల వరకు ‘ప్రజల సంరక్షణ-శాంతిభద్రతల పరిరక్షణ’, 3.30 నుంచి 4 గంటల వరకు ‘పర్యాటక అభివృద్ధికి పటిష్ట చర్యలు’, 4 నుంచి 4.30 గంట వరకు రాజకీయ తీర్మానం ఉంటుంది. 4.30 నుంచి 4.45 గంటలకు జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణం ఉంటుంది. 4.45 గంటల నుంచి 5.30 వరకు జాతీయ అధ్యక్షుడి ముగింపు ఉపన్యాసం ఉంటుంది.

Leave a Reply