నేడు ఎంగిలిపూల బతుకమ్మ..

నేడు ఎంగిలిపూల బతుకమ్మ..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : తెలంగాణ (Telangana) సంస్కృతి సంప్ర‌దాయ‌ల‌కు ప్రతీకగా జ‌రుపుకునే పూల పండుగ బతుకమ్మ(Bathukamma) వేడుక‌లు ఆదివారం (సెప్టెంబ‌రు 21) నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వ‌హించుకునే ఈ వేడుక‌ల్లో భాగంగా మొద‌టి రోజు ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ (Engilipoola Bathukamma) వేడుకలను జ‌రుపుకునేందుకు ఆడబిడ్డలు సిద్ధ‌మ‌య్యారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

బతుకమ్మ పండుగకు గ్రేటర్ జీహెచ్ఎంసీ (Greater GHMC) విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. చెరువుల వద్ద శుభ్రత కార్యక్రమాలు, దోమల నివారణ స్ప్రేలు, భద్రతా చర్యలు ఇప్పటికే చేపట్టారు. మహిళా సంఘాలు, వాలంటీర్లు, స్థానిక సంఘాల సహకారంతో బతుకమ్మ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో మరింత ఉత్సాహభరితంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఈసారి నగర వ్యాప్తంగా 384కి పైగా బతుకమ్మ కుంటలు, చెరువులు, తాత్కాలిక కుంటలు, ట్యాంకులు సిద్ధం చేశారు. ప్రజల సౌకర్యార్థం 82 తాత్కాలిక మరుగుదొడ్లు, 45 వేల తాత్కాలిక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు జరిగే ప్రదేశాలలో 1,450 శానిటేషన్ సిబ్బంది పారిశుద్ధ్య (Sanitation) కార్యక్రమాలు చేపట్టనున్నారు.

తొమ్మిది రూపాల బతుకమ్మల పేర్లు..
ఎంగిలిపూల బతుకమ్మ
అటుకుల బతుకమ్మ
ముద్దపప్పు బతుకమ్మ
నాన బియ్యం బతుకమ్మ
అట్ల బతుకమ్మ
అలిగిన బతుకమ్మ
వేపకాయల బతుకమ్మ
వెన్నముద్దల బతుకమ్మ
సద్దుల బతుకమ్మ (చివరిరోజు)

Leave a Reply