అనంత లోకాలకు.. విద్యార్థి మృతి..

అనంత లోకాలకు.. విద్యార్థి మృతి..
కేతేపల్లి, ఆంధ్రప్రభ : నీటి గుంటలో పడి ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కాసనగోడు గ్రామంలో ఈ రోజు చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంచo అయాన్(Kuncho Ayan)(4) తమ గ్రామంలోని అంగన్వాడి కేంద్రానికి ప్రతి రోజు లాగే వెళ్ళాడు. అక్కడ పాఠశాల ప్రారంభించిన తర్వాత విద్యార్థులను మూత్ర విసర్జనకు తీసుకువెళ్లే ప్రయత్నంలో పాఠశాల ప్రాంగణం వదిలి సిబ్బంది విద్యార్థులను వదిలి బయటికి వెళ్లారు.
అక్కడ విద్యార్థి బహిర్బుమి కోసం వెళ్లి అక్కడే ఉన్న నీటి గుటలో పడీ మృతి చెందాడు. ఈ విషయం గమనించిన సిబ్బంది సమీపంలో ఉన్న వారికి సమాచారం అందించడంతో వచ్చేసరికి అప్పటికే బాలుడు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు(police case) నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు బాత్రూం ఉన్నప్పటికీ విద్యార్థులను బయటకు తీసుకెళ్లడంపై గ్రామస్తులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూడు నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఆలనా, పాలనా సంరక్షణ చూసేందుకు అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి కార్యకర్తలతో పాటు ఆయను ప్రభుత్వం నియమించంది. అయితే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన అంగన్వాడి సిబ్బంది విద్యార్థి మృతికి కారణమైన వారిపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు.
