కానరాని లోకానికి…

కానరాని లోకానికి…

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : దసరా పండుగ నిమిత్తం హైదరాబాద్(Hyderabad) నుంచి స్వగ్రామం కు వచ్చి కుటుంబ సభ్యులతో దసరా జరుపుకున్నాడు. స్నేహితులతో సరదాగా గడిపాడు. ఇక తిరిగి తన బతుకు తెరువు నిమిత్తం చేస్తున్న ఉద్యోగ విధులను నిర్వర్తించేందుకు హిందూపురం నుంచి హైదరాబాదుకు వెళుతూ…. మార్గం మధ్యలో ధర్మవరంలో నీళ్లు బాటిల్(Battle) కోసం కిందికి దిగి, బాటిల్ తీసుకొని రైలు ఎక్కుతుండగా పొరపాటున కాలు జారి రైలు కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

బాధాకరమైన ఈ సంఘటన సోమవారం ధర్మవరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి రైల్వే పోలీసులు అందించిన సమాచారం మేరకు హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు(Chilamathur) మండలం మొరంపల్లి గ్రామానికి చెందిన కమలాకర్, వయస్సు:- 34 సంవత్సరాలు, తండ్రి గురుమూర్తి, అను వ్యక్తి హిందూపురం నుండి హైదరాబాదుకు వెళ్లాలని హిందూపురం(Hindupuram) రైల్వే స్టేషన్ లో అహ్మదాబాద్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కి ప్రయాణిస్తూ ధర్మవరం రైల్వే స్టేషన్లో నీళ్ల బాటల్ కోసం రైల్వేస్టేషన్లో రైలు దిగి రైలు కదులుతుండగా తిరిగి కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి రైలు కిందపడి చనిపోయినాడు.

మృతుడు హైదరాబాదులోని బయోసైన్స్(Bioscience) అనే కంపెనీ లో పనిచేస్తాడు. మృతుడికి ఇంకా పెళ్లి కాలేదని తెలిసింది. మృతుడి శవాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply