తిరువూరు – బదిలీ జరిగి నెల రోజులు దాటినా ఎమ్మెల్యే ఒత్తిడితో ఉన్నతాధికారులు రిలీవ్ చేయడం లేదని ఆరోపిస్తూ, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ జలవనరుల శాఖ తిరువూరు ఏఈఈ వి. కిశోర్ శుక్రవారం లేఖ రాసి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏఈఈ అదృశ్యం వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన తిరువూరు పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఏఈఈ కిశోర్ ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం రాజమహేంద్రవరంలో గోదావరి ఒడ్డున ఆత్మహత్యకు యత్నిస్తుండగా కిషోర్‌ను పోలీసులు గుర్తించి కాపాడారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం నుండి ఆయనను పోలీసులు తిరువూరుకు తీసుకొని వస్తున్నారు.
Criciket News – WCL 2025| భారత్ – పాక్ మ్యాచ్ రద్దు
సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కిషోర్‌ను గుర్తించిన పోలీసులు అతని అర్దాంగితో ఫోన్‌లో మాట్లాడిస్తూ ఈరోజు ఉదయం గోదావరి ఒడ్డున పట్టుకోవడంతో మిస్సింగ్, ఆత్మహత్యయత్నం కథ సుఖాంతం అయింది. మరోవైపు, కిశోర్ అదృశ్యం వ్యవహారంతో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు అలెర్ట్ అయ్యారు. ఈఎన్సీ ఆదేశాలతో ఆయనను వెంటనే రిలీవ్ చేస్తూ నిన్న డీఈఈ లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చారు. తిరువూరుకు సంబంధించిన బాధ్యతలను స్పెషల్ డివిజన్ అధికారులకు అప్పగించి, కంచికచర్ల డివిజన్ బాధ్యతలు కిశోర్ తీసుకోవాలని ఉత్తర్వులో డీఈఈ పేర్కొన్నారు.

