Tirupati | అభివృద్ధి అంటే మాటలు కాదు..

Tirupati | అభివృద్ధి అంటే మాటలు కాదు..
Tirupati | తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ : తంగళ్ళపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పెద్దూరి తిరుపతి ఎన్నికల (Election) ప్రచారంలో వేగం రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. ఉదయం తొందరగానే ఇంటింటి ప్రచారం ప్రారంభించిన తిరుపతి, తన బృందంతో కలిసి గ్రామ ప్రజల సమక్షంలో అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్ని పలకరించిన ఈ ప్రచార యాత్రకు స్థానిక యువత భారీగా తోడయ్యారు. గ్రామంలో రెండుసార్లు ఉప సర్పంచ్‌గా పని చేసిన అనుభవం తిరుపతికి బలంగా మారింది. “గ్రామం కోసం పని చేసే నాయకుడి అవసరం ఇప్పుడు ఎక్కువ.
గతంలో చేసిన సేవే నా ఆయుధం. మళ్లీ అవకాశం ఇస్తే.. తంగళ్ళపల్లి అభివృద్ధిని కొత్త దిశలో తీసుకెళ్తా అని తిరుపతి (Tirupati) ప్రజలకు భరోసా ఇస్తున్నట్లు ప్రచారంలో పాల్గొన్న వారు చెబుతున్నారు. ప్రచారం సాగిన ప్రతి వీధిలో ఆయనకు అనూహ్య స్పందన లభించింది. యువత ఎక్కడ చూసినా.. తిరుపతికి భరోసా తెలిపేలా ప్రచారంలో ముందుండడం ప్రత్యేకంగా కనిపించింది. మహిళలు, పెద్దలు పలకరించి ఆశీర్వదించడం ప్రచారానికి మరింత జోష్ తెచ్చింది.
