tirumala| కొండ‌పై కొన‌సాగుతున్న ర‌ద్దీ

tirumala| కొండ‌పై కొన‌సాగుతున్న ర‌ద్దీ

ఏడుకొండ‌ల‌వాడి ద‌ర్శ‌నానికి భారీ క్యూ

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తిరుమల కొండ ఎప్పుడూ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతూనే ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం అంటూ లేకుండా శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు వ‌స్తూనే ఉంటారు. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు అయిపోయిన నేప‌థ్యంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మ‌రికొన్ని రోజులైతే పాఠ‌శాల‌ల‌కు కూడా సెల‌వులు రానున్న నేప‌థ్యంలో మున్ముందు ర‌ద్దీ ఇంకా ఎక్కువ‌గా పెర‌గ‌నుంది. శనివారం కావడంతో భక్తుల ఎక్కువగానే వ‌చ్చారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టైమ్‌స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి సుమారు 12 నుంచి 15 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వర్గాలు తెలిపాయి.

నిన్న శుక్రవారం (మార్చి 27) మొత్తం 67,526 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 25,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా ఒక్కరోజే రూ. 3.45 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం 30 కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి.

Leave a Reply