మీరు ఎక్కడికైనా వెళ్తే ఇల్లు జాగ్రత్త సుమీ..!!

మీరు ఎక్కడికైనా వెళ్తే ఇల్లు జాగ్రత్త సుమీ..!!

  • అలసిపోయి ఆరు బయట విశ్రాంతి తీసుకుంటున్నారా జాగ్రత్త
  • అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి
  • అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే
  • పోలీసులకు సమాచారం అందించాలి

టేకుమట్ల, ఆంధ్రప్రభ ; వేసవి కాలం వచ్చేసింది. వడగాల్పులు ప్రారంభమ య్యాయి. ఉక్కపోత పెరిగింది. పగలంతా ఎండకు ఎండి వడగాల్పులకు అలసిపోయి సాయంత్రం సమయంలో వచ్చే చల్లగాలికి ఆరుబైట విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. మరికొంత మంది డాబాపైకి వెళ్లి నిద్రిస్తూ ఉంటారు. ఇంకొంత మంది బెడ్‌రూమ్‌లో ఏసీ, ఫ్యాన్లు వేసుకుని నిద్రిస్తూ ఉంటారు. ఆ ఏసీ, ఫాన్ల శబ్దాలకు బయట నుంచే వచ్చే శబ్దాలు తెలియవు.

ఇదే అదునుగా దొంగలు యథేచ్ఛగా దొంగతనాలకు పాల్పడుతూ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ రెచ్చి పోతున్నారు. అయితే స్థానికంగా ఉండే దొంగల విధానం వేరు.. వీరు పగటి వేళ రెక్కీ నిర్వహించి ఇళ్లకు తాళాలు వేసి ఉన్నవాటిని పరిశీలిస్తారు. సాయంత్రం సమ యంలో ఇళ్లల్లో లైట్లు వెలగడం కాని, బయట లైట్లు వెలగడం కాని లేకపోతే కచ్చితంగా వారు ఊరు వెళ్లారని గుర్తించి ఆ ఇంటిలో దొంగతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు కాగా ఇటీవల మొగుళ్లపల్లి మండలంలో చోరీలకు కొంతమంది పాల్పడుతున్నారు. కాగా.. జాగ్రత్తగా ఉండాలి.
మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
టేకుమట్ల ఎస్సై అమూల్య

మండలంలోని ప్రజలు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకునిఅపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని టేకుమట్ల ఎస్ఐ అమూల్య అన్నారు. గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు , అపరిచితులు, అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. వారితో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటంతో చాలామంది రాత్రి వేళల్లో ఇంటి ముందు లేదా ఆరుబయట నిద్రిస్తుంటారు. మహిళలు బయట పడుకునే సమయంలో ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు.

మార్కెట్‌లో బంగారం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, దొంగలు నివాస ప్రాంతాలపై కన్నేసే అవకాశం ఉంది. కావున మీ విలువైన బంగారు నగలను, నగదును సురక్షితమైన ప్రదేశాల్లో భద్రపరుచుకోవాలనీ కోరారు. ​ఎవరైనా అనుమానితులు కనిపిస్తే , ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉందనిపిస్తే భయపడకుండా ,వెంటనే డయల్ 100 కి గానీ లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మండల​ ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ, దొంగతనాల నియంత్రణకు పోలీసు వారితో సహకరించాలని ఎస్సై కోరారు.

Leave a Reply