Ticket | ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి సరిత..

Ticket | ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి సరిత..

Ticket | పాల్వంచ, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూకల సరిత ప్రసారంలో దూసుకుపోతున్నారు. బుధవారం కాంట్రాక్టర్ కాలనీ, అమాలి కాలనీలో విస్తృత ప్రచారం నిర్వహించారు. తనదైన శైలిలో ఓటర్లను కలిసి ఓటును అభ్యసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ తాను గెలిస్తే అభివృద్ధి చేసే అంశాలను అర్థమయ్యే రీతిలో ఓటర్లకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు.

గెలుపే లక్ష్యంగా ప్రసారం వేగం పుంజుకున్నది. గెలిపించే బాధ్యత ఓటర్లుదని అభివృద్ధి చేసే బాధ్యత తమదని ప్రచారం చేస్తూ అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తనపై పూర్తి నమ్మకంతో టికెట్ ఇచ్చినందుకు గెలిసి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మంచి పేరును పొందుతానని అభ్యర్థి నూకల సరిత ఆంధ్ర ప్రభ తో ముచ్చటించారు. అందరికీ పరిచయస్తురాలుగా పలకరింపులో ముందు వరుసలో ఉన్నందున తన గెలుపు నల్లేరు మీద నడకేనని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply