తానూరు, ఆంధ్రప్రభ న్యూస్ : తెలంగాణ‌-మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు నిర్మ‌ల్(Nirmal) జిల్లా తానూరు(Tanur) మండలం బెల్ తారోడకు మూడు కి.మీ దూరంలో ఈ రోజు తెల్ల‌వారుజామున‌ జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మహారాష్ట్ర(Maharashtra)లో దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా, పక్కన పార్క్ చేసి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీ కొంది. ఈ ప్ర‌మాదం(accident)లో కారులో ఉన్న ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంకు చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం నిమిత్తం భైంసా నుంచి నిజామాబాద్(Nizamabad) ఆస్ప‌త్రికి తరలించారు. ఈ దుర్ఘ‌ట‌న‌లో వ‌ర్నిలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Leave a Reply