ముగ్గురికి నోబెల్ గౌరవం

హైదరాబాద్‌, వెబ్‌డెస్క్‌: వైద్యరంగంలో అత్యున్నతమైన నోబెల్‌ బహుమతి (Nobel Prize) ని ఈసారి ముగ్గురు శాస్త్రవేత్తలు దక్కించుకున్నారు. 2025 సంవత్సరానికి గాను మేరీ ఇ. బ్రన్కో, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్, షిమన్‌ సకాగుచిలకు సంయుక్తంగా ఈ గౌరవాన్ని ప్రకటించింది నోబెల్‌ కమిటీ.

రోగనిరోధక శక్తి (Immune System) పై వీరు నిర్వహించిన కీలక పరిశోధనలకు గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందించారు. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో సోమవారం నోబెల్‌ కమిటీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.

Leave a Reply