Threatening Call | విజయవాడలో బాంబు కలకలం

బెజవాడకు బాంబు బెదిరింపు…
కలవరపడ్డ నగర ప్రజలు…
కంట్రోల్ రూమ్ కి అగంతుకుడి ఫోన్ కాల్..
అప్రమత్తమైన పోలీసులు….
పోలీసు ఆధీనంలో బీసెంట్ రోడ్డు..
షాపులు మూసి, విస్తృత తనిఖీలు..
నాలుగు బృందాలుగా.. డాగ్ స్క్వేర్ తో తనిఖీలు..
మూడు గంటల పాటు ఉత్కంఠ…
ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న వైనం..
ఫోన్ చేసిన ఆగంతకడి కోసం వేట…

ఎన్టీఆర్ బ్యూరో – ఆంధ్రప్రభ, వందల సంఖ్యలో షాపులు… లెక్కలేనంతమంది హెకర్లు.. వేల సంఖ్యలో కొనుగోలుదారులు… నడవడానికి కూడా వీలు లేనంత వ్యాపారం.. ఇది బెజవాడ నగరంలోని బీసెంట్ రోడ్డు పరిస్థితి. నిత్యం కిటకిటలాడే బీసెంట్ రోడ్డు కు బాంబు బెదిరింపు రావడంతో నగరవాసులంతా కలవరపాటికి గురయ్యారు. శనివారం ఉదయం పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసినవా అగంతకుడు బీసెంట్ రోడ్ లో బాంబు ఉన్నట్టు, మరి కొంత సమయంలో బాంబు పేలుతుందని చెప్పి ఫోన్ కట్ చేయడంతో, నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నాలుగు బృందాలుగా రంగంలోకి దిగిన పోలీసులు బీసెంట్ రోడ్డు మొత్తాన్ని బాంబు కోసం జెల్లెడు పట్టడం ప్రారంభించారు.

ఇటు బందర్ రోడ్డు నుండి అటు ఏలూరు రోడ్డు వరకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు విస్తీర్ణం ఉన్న బీసెంట్ రోడ్డును తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, షాపులన్నింటినీ క్లోజ్ చేసి అటుగా స్థానికులను ఎవరిని రానివ్వకుండా అన్ని రహదారులను మూసివేశారు. పోలీసు ప్రత్యేక బృందాలు, మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్ తో బీసెంట్ రోడ్డు మొత్తం గాలించారు. బీసెంట్ రోడ్డులో ఎక్కువ సంఖ్యలో తోపుడు బండ్లు, హ్యాకర్ షాపులు ఉండడంతో వాటన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు

. సుమారు మూడు గంటల పాటు అన్ని ప్రాంతాలను అణువణువునా తనిఖీ చేసిన పోలీసులు చివరకు ఎటువంటి. బాంబు లభించకపోవడంతో ఇది ఒక ఫేక్ కాల్ గా గుర్తించారు. ఈ పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ కి కాల్ చేసిన అగంతకుడు సమాచారం కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అయితే మూడు గంటల పాటు బీసెంట్ రోడ్డు మొత్తం పోలీసులు జల్లెడ పడుతుండడం ఏం జరుగుతుందో తెలియక నగరవాసులంతా ఉత్కంఠతకు గురయ్యారు.

Leave a Reply