Thirumal l 13వ వార్డులో తిరుమల్ గెలుపు పక్క .. సింహం గుర్తువైపు ప్రజల మొగ్గు

Thirumal l 13వ వార్డులో తిరుమల్ గెలుపు పక్క .. సింహం గుర్తువైపు ప్రజల మొగ్గు
Thirumal l పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: పట్టణంలోని 13వ వార్డులో సల్వాజి తిరుమల్ గెలుపు ఖాయం అయిపోయింది. వార్డు ప్రజలు సింహం గుర్తు వైపు ముగు చెబుతున్నారు. ప్రచారంలో తిరుమల్ కు బ్రహ్మరథం పట్టారు. అడుగు అడుగున నీరాజనాలు పలికారు. తామంతా సింహం గుర్తుకే ఓటు వేస్తామని శపథం చేశారు. సోమవారం చివరి రోజు ప్రచారంలో భాగంగా గడపగడపకు వెళ్లి తిరుమల్ ఓటు అభ్యర్థిగా మెజార్టీ ప్రజలు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజల ఆశీర్వాదంతో తాను మున్సిపల్ పాలకవర్గంలోకి అడుగుపెడుతున్నట్లు తెలియజేశారు.
తనను ఆశీర్వదించిన ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. వార్డులో అవసరం ఉన్న ప్రతి చోటా సిసి రోడ్లు డ్రైనేజీలతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేస్తానన్నారు. అధికార ప్రతిపక్షాల నాయకులను కాదని తనకు మద్దతిస్తున్న వార్డు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రచారంలో తిరుమల్ వెంట సున్నాయి టెంకం సురేష్, కోల ప్రశాంత్ తో పాటు పలువురు ఉన్నారు. ప్రచార తీరును గమనిస్తే 13వ వార్డు లో తిరుమల గెలుపు ఖాయం అయిపోయినట్లు భావిస్తున్నారు.
