ఎక్కడికి పోతారు…
ఆంధ్రప్రభ, క్రైం : అమాంతంగా బిలబిలమంటూ వచ్చారు…భీభత్సం సృష్టించారు…తుపాకులతో బెదిరించారు. హడావుడి చేసారు…దొరికిన నగలను దొరికినట్టు దోచుకుని ఉడాయించే ప్రయత్నం చేసారు…. సీసీటీవీల్లో చిక్కారు…
హైదరాబాద్‌లోని చందానగర్ (Chandanagar)లో ఇటీవల సంచలనం రేపిన ఖజానా జ్యువెలర్స్ (Khajana Jewellers) దోపిడీ కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. పటాన్‌చెరు (Patancheru) సర్వీసు రోడ్డుపై ముగ్గురు దొంగలను, సంగారెడ్డి (Sangareddy) సమీపంలో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని మొత్తం ఆరుగురినీ అరెస్టు చేశారు.
రెండు బైక్‌ల (Two bikes) పై పారిపోతుండగా చాకచక్యంగా వారిని పట్టుకోవడం పోలీసుల చురుకుదనానికి నిదర్శనమైంది. ఫేసుకు మాస్క్, తలపై క్యాపు, చేతులకు గ్లౌజులు వేసుకొని వెళ్తుండగా వీరంతా పట్టుబడ్డారు. దొంగతనం చేసిన బైక్ లనే దోపిడీ(extortion) కి వాడినట్లు గుర్తించారు పోలీసులు. ఈ దోపిడీ వెనుక అంతర్-రాష్ట్ర ముఠాల హస్తం ఉందా అని కూడా పరిశీలిస్తున్నారు.
తుపాకులతో సిబ్బందిని బెదిరించి..
చందానగర్‌లో ఉన్న ఖజానా జ్యువెలర్స్ (Khajana Jewellers) లో మంగళవారం (ఆగస్టు 12) ఉదయం షాపు తెరిచిన వెంటనే ముసుగులు ధరించిన ఆరుగురు దుండగులు షాపులోకి చొరబడ్డారు. తుపాకులతో సిబ్బందిని బెదిరించి, లాకర్ తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిబ్బంది నిరాకరించడంతో గాల్లోకి, అలాగే డిప్యూటీ మేనేజర్ (Deputy Manager) కాలిపై కాల్పులు జరిపి భయానక వాతావరణాన్ని సృష్టించారు.
కేసును ఛేదించిన పోలీసులు..
అందినకాడికి దోచుకుని అనంతరం సీసీ కెమెరాలను ధ్వంసం (CCTV cameras destroyed) చేసి, ప్రదర్శనలో ఉన్న వెండి ఆభరణాలను దోచుకుని పారిపోయారు. వెంటనే షాపు సిబ్బంది సైబరాబాద్ (Cyberabad) పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ కేసును ఛేదించడానికి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్నారు. ఈ దోపిడీ ఘటనలో గాయపడిన డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

