దొరికిన దొంగలు
సూర్యాపేట, ఆంధ్రప్రభ :
ఆంధ్రప్రభ మినీలో ఆదివారం ప్రచురితమైన పోలీసులా..? దొంగలా..? అనే వార్త శీర్షిక పై అధికారులకు క్లారిటీ వచ్చింది. ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను అడ్డగించి వసూళ్లకు చేసింది సివిల్ పోలీసులు, దొంగల ముఠా కాదని.. రవాణా శాఖ అధికారులేనని తేలారు. మూడు నెలల క్రితం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఎఎంవిఐతో కూడిన బృందమే ఈ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ అక్రమ బరి తెగింపు వసూళ్ల వ్యవహారాల పై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ చాలా ఆగ్రహాంగా ఉన్నారని జిల్లా రవాణాశాఖ అధికారులను తక్షణమే నివేదిక అందించాలని ఆదేశించినట్లు సమాచారం.

