BCCI | U -19 WC యోధులు వీరే !!

BCCI | U -19 WC యోధులు వీరే !!

ఆంధ్ర‌ప్ర‌భ : 2026 అండర్-19 ప్రపంచకప్ (U -19 WC) సమరానికి రంగం సిద్ధమైంది. జనవరి 15 నుండి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శనివారం యువ భారత్ జట్టును ప్రకటించింది. ఐదుసార్లు (2000, 2008, 2012, 2018, 2022) ఛాంపియన్‌గా నిలిచిన భారత్, ఈసారి ఎలాగైనా ఆరోసారి ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. కాగా, ప్రపంచకప్ జట్టుకు ఆయుష్ మాత్రే కెప్టెన్‌గా, విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

అయితే, ఈ ప్రపంచకప్‌కు ముందు భారత్ ఒక కీలకమైన పాఠాన్ని నేర్చుకుంది. డిసెంబర్ 12 నుంచి 21 వరకు జరిగిన అండర్-19 ఆసియా కప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తూ ఫైనల్ వరకు దూసుకెళ్లింది. కానీ, తుది పోరులో దాయాది పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది.

ఈ పరాభవాన్ని మరిచిపోయి, ప్రపంచ వేదికపై సత్తా చాటాలని యువ యోధులు భావిస్తున్నారు. ఈ అండర్‌–19 ప్రపంచ కప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. నాలుగు గ్రూపులుగా విభజించ‌గా.. భారత్ గ్రూప్-బిలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అమెరికాతో తలపడనుంది. జనవరి 15న యూఎస్‌ఏతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం 17న బంగ్లాదేశ్‌తో, 24న న్యూజిలాండ్‌తో లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. లీగ్ మ్యాచ్ ల అనంతరం సూపర్‌ సిక్స్‌, సెమీఫైనల్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. హరారే వేదికగా జరిగే ఫైనల్ పోరుతో ఈ టోర్నీ ముగియనుంది.

దక్షిణాఫ్రికా సిరీస్‌కు కెప్టెన్ గా యువ సంచలనం.

ఇదిలా ఉండ‌గా.. ప్రపంచకప్ సమరానికి ముందు సన్నాహకాల్లో భాగంగా టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు సంబంధించి ఒక చిన్న మార్పు జరిగింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా ఇద్దరూ గాయాలతో బాధపడుతుండటంతో వారికి విశ్రాంతినిచ్చారు. చికిత్స కోసం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు పంపారు. వీరి గైర్హాజరీలో దక్షిణాఫ్రికా పర్యటనకు టీనేజ్ సెన్షేన్ వైభవ్ సూర్యవంశీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా, ఆరోన్ జార్జ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

 U -19 WC
Ravi Shastri | ఇంగ్లాండ్ హెడ్ కోచ్ గా ర‌విశాస్త్రి కావాలి..

ఆసియా కప్‌లో రాణించిన దాదాపు అందరు ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో చోటు లభించింది. వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు వంటి ఆటగాళ్లు తమ ఫామ్ కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ ముగించుకున్న తర్వాత, ఆయుష్ మాత్రే, విహాన్ మల్హోత్రా పూర్తి ఫిట్‌నెస్‌తో నేరుగా జింబాబ్వేలో జట్టుతో కలవనున్నారు.

భారత్‌ U -19 WC జట్టు ఇదే :

ఆయుష్‌ మాత్రే (కెప్టెన్‌), విహాన్‌ మల్హోత్రా (వైస్‌ కెప్టెన్‌), వైభవ్‌ సూర్యవంశీ, ఆరోన్‌ జార్జ్‌, వేదాంత్‌ త్రివేది, అభిజ్ఞాన్ కుందూ (వికెట్‌కీపర్‌), హర్వంశ్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), ఆర్‌ఎస్‌ అంబ్రిష్‌, కనిష్క్‌ చౌహాన్‌, ఖిలాన్‌ పటేల్‌, మహ్మద్‌ ఎనాన్‌, హెనిల్‌ పటేల్‌, డి. దీపేశ్‌, కిషన్‌ కుమార్‌ సింగ్‌, ఉధవ్‌ మోహన్‌.

Leave a Reply