ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డులు ఇవే
హైదరాబాద్, ఆంధ్రప్రభ : నవంబర్ 11వ తేదీన జరగనున్న జూబ్లీ హిల్స్(Jubilee Hills) అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుండి … ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) కాకుండా ఈ క్రింద చూపిన 12 ప్రత్యామ్నాయ ఫోటో ఐడీలలో దేనినైనా ఒకటి పోలింగ్ సిబ్బందికి చూపి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని జిహెచ్ఎంసి కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ తెలిపారు.
ఆధార్, ఉపాధి హామీ జాబ్ కార్డు(Employment Guarantee Job Card), బ్యాంకు, తపాల కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ బుక్, కేంద్ర కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు లేదా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్ఎఐ) కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్(Registrar General and Census) కమిషనర్ ఇండియా (RGI) జారీ చేసిన స్మార్ట్ కార్డు, భారతీయ పాస్ పోర్ట్, ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్ యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజేబుల్(Uniquely Disabled) గుర్తింపు కార్డు (యూడీఐడీ)లు కలిగి ఉండాలనీ జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు.
ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా…. ఈ 12 ఫోటో కార్డులో ఏ గుర్తింపు కార్డు ఉన్న ఓటు వేయవచ్చునని జిహెచ్ఎంసి కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ తెలిపారు.

