గ్యాంగ్ వార్.. ఎక్కడంటే…

  • నాటు తుపాకీ కాల్పుల కలకలం
  • సస్పెండెడ్ కానిస్టేబుల్ పై అనుమానం..


( ఆంధ్రప్రభ, విశాఖపట్నం) : ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ (Visakhapatnam) లో.. ఇక నేరాలు ఘోరాలకు అంతు పొంతూ ఉండదనే రీతిలో.. సోమవారం ఓ వ్యక్తిపై నాటు తుపాకీ కాల్పుల‌ కలకలం రేపింది. ఇక తెరమీదకు గ్యాంగ్ స్ట‌ర్ ల (Gangsters) గ్యాంగ్ వార్ (gang war) లు తెరమీదకు వస్తాయని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖపట్నంలో అకస్మాత్తుగా ఈ నాటు తుపాకీ వ్యవహారం కలవరం అంతే ప్రశాంత విశాఖ నగరం ఉలిక్కిపడింది. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం ((Visakhapatnam) నగరం వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని చిలకపేట ప్రధాన గేటు సమీపంలో చేపల రాజేష్‌ అనే వ్యక్తి పై గుర్తు తెలియని వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు.

ఈ దాడిలో గాయపడిన రాజేష్ (Rajesh) ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు (police) అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సస్పెన్షన్ (suspend) లో ఉన్న ఓ కానిస్టేబుల్‌ ఈ కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాల్పులకు పాల్పడిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరార్ కావడంతో అతిడి కోసం గాలింపులు చేపట్టారు.

Leave a Reply