• చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్


చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆర్ ఎస్ కె ల నుంచి యూరియా పంపిణీ (Urea Distribution) జరుగుతోందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ (Collector Sumit Kumar) తెలిపారు. జిల్లాలో చిత్తూరు, పూతలపట్టు, జి డి నెల్లూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు నగరి నియోజకవర పరిధిలోని 125 క్లస్టర్ లలో 3293 మెట్రిక్ టన్నులు నిల్వ ఉందని తెలిపారు. ఆర్ ఎస్ కె లు, ప్రైవేట్ షాప్స్ సొసైటీలలో పకడ్బందీగా యూరియా పంపిణీని నిర్వహించాలని ఎలాంటి పొరబాట్లు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.

రైతులకు (Farmers) ఆర్ ఎస్ కె ల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నామని, యూరియా నిల్వలు ఉన్నాయని, ఈ నిల్వలు రైతుల అవసరాలకు సరిపోతాయన్నారు. అవసరం అయితే ఇంకా జిల్లాకు యూరియా తెప్పించడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం 45 వేల హెక్టార్లలో పంటలు పండించగా 15 వేల టన్నులు యూరియా పంపిణీ చేశామని, యూరియా పంపిణీ (Urea Distribution) రైతులు పండిస్తున్న పంటను బట్టి ఇస్తున్నామని, అవసరమైన మేర మాత్రమే యూరియా వాడాలని జిల్లా కలెక్టర్ పై ప్రకటనలు తెలిపారు.

Leave a Reply