రజనీకాంత్ ప్రధాన పాత్రలో విడుదలైన కూలీ ప్రస్తుతం దేశమంతా ప్రదర్శింపబడుతూ, అన్ని వర్గాల ప్రేకషకులను ఆకట్టుకుంటూ దూసుకెళ్తోంది.

ఈ మూవీలో రజనీతోపాటు మరో ఇద్దరు కథానాయకులు కనిపించి తెరపై సందడి చేసారు. వారిలో ఒకరు కింగ్ నాగార్జునైతే రెండో హీరో బాలీవుడ్ లో విభిన్న పాత్రలకు కేరాఫ్ ఆమిర్ ఖాన్. తెరపై కనిపించింది కాసేపే అయినా… ఆమిర్ ఖాన్ పాత్ర ఈ సినిమాకి హైలైట్ అయ్యింది.

అయితే ఆ మాత్రం తెరపై కనిపించేందుకు ఆమిర్ ఖాన్ భారీ పారితోషికమే తీసుకున్నాడని సినీ వ‌ర్గాల్లో జోరుగా ప్రచారం కొనసాగింది. భారీ అంటే అంతా ఇంతా కాదు… ఏకంగా ఇరవై కోట్ల పారితోషికం ఆమిర్ కు అందిందని చెప్పుకున్నారు. ఈ విషయమై స్వయంగా ఆమిర్ ఖానే ఒక ఇంటర్వ్యూలో స్పందించి… ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు.

అదేమిటంటే, ఈ సినిమాలో కనిపించడానికి తానేమీ తీసుకోలేదట. రజనీతో కలిసి స్క్రీన్ షేరింగ్ చేసుకోవడమే తనకు కోట్ల రూపాయల పారితోషికమట. అంతే కాదు, రజనీ అంటే తనకు ఎంతో ప్రేమ అనీ, నాగార్జున, రజనీ వల్లే ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులు వస్తున్నారు గానీ, తనకోసం కాదనీ ఆమిర్ చెప్పుకొచ్చాడు ఆ ఇంటర్వ్యూలో.

Leave a Reply