ఎక్క‌డా చెరువులు తెగ‌లేదు

  • అసత్య ప్రచారాలు చేయొద్దు
  • కలెక్టర్ రాహుల్ శర్మ, ఇరిగేషన్ ఈఈ


ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లాలో గణపురం(ము), భీమ్ ఘనపూర్ చెరువు ఇలా కొన్ని ప్రాంతాల్లో చెరువులు తెగిపోయాయని కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు పోస్ట్ చేశారు. ఈ పోస్టు శుక్రవారం ఉదయం చెక్కర్లు కొట్టడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దీనిపై జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ (Rahul Sharma), జిల్లా ఇరిగేషన్ ఈఈ బసవ ప్రసాద్ శుక్రవారం స్పందించారు.

ప్రస్తుతం జయశంకర్ జిల్లా పరిధిలోని చెరువులు అన్నీ సురక్షితంగా ఉన్నాయని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని కలెక్టర్, ఇరిగేషన్ ఈఈ స్పష్టం చేశారు. సంబంధిత ప్రాంతాల్లో డీఈఈలు, ఏఈఈలు, లష్కర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వదంతులను నమ్మొద్ద‌న్నారు.

Leave a Reply