ఆలయంలో అపహరణకు గురైన హుండీ

ఆలయంలో అపహరణకు గురైన హుండీ

మర్రిగూడ,ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని శ్రీ శంభు రామలింగేశ్వర స్వామి ఆలయంలో హుండీ చోరీకి గురైనట్లు ఆలయ నిర్వహకులు ఎల్.వి శర్మ మర్రిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల క్రితం శ్రీశంభు రామలింగేశ్వర స్వామి జాతర కార్యక్రమం ముగిసింది. ఇందులో భాగంగా గర్భగుడి ముందున్న హుండీనీ గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు హుండీతో సహా మంగళవారం రాత్రి అపహరణకు గురైనట్లు ఆలయ పూజారి, మాజీ ఎంపీటీసీ పి.విజయ రామారావు, మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చెరుకు శ్రీరాములు గౌడ్ మర్రిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Leave a Reply