మచిలీపట్నం సర్కార్ తోటలో పట్టపగలు చోరీ కలకలం

మచిలీపట్నం సర్కార్ తోటలో పట్టపగలు చోరీ కలకలం

మచిలీపట్నం, ఆంధ్రప్రభః మచిలీపట్నం సర్కార్ తోట ప్రాంతంలో పట్టపగలు చోరీ ఘటన సంచలనం సృష్టించింది. పెడన మండలం కౌతరం ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నిమ్మగడ్డ మార్గనేట్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఉదయం 7 గంటలకు విధులకు వెళ్లిన టీచర్, తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి దుండగులు చోరీ చేసినట్లు గుర్తించారు. ఇంట్లో విలువైన బంగారు నగలు, నగదు అపహరించబడినట్లు సమాచారం.


సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా పోలీస్ జాగిలాలను రంగంలోకి దింపి దుండగుల జాడ కోసం గాలింపు చేపట్టారు. పట్టపగలు జరిగిన ఈ చోరీతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నగరంలో వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply