Theft | ఇంటిని ఊడ్చేసిన దొంగలు..

Theft | ఇంటిని ఊడ్చేసిన దొంగలు..

  • గండిగుంటలో భారీ దొంగతనం

Theft | ఉయ్యురు, ఆంధ్రప్రభ : సంక్రాంతి సెలవులకు ఊరెళితే దొంగలు ఇంటిని ఊడ్చేసిన ఘటన ఉయ్యురు గండిగుంట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. భారీ దొంగతనం జరగటంతో మండలంలో ఆందోళన కలిగించింది. 20 కాసుల బంగారం, 4 కేజీల వెండి, రూ. లక్ష నగదు చోరీ చేశారు. జూలూరు సందీప్ కుటుంబంతో సంక్రాంతికి మూడు రోజులు ఊరు వెళ్లారు. శనివారం ఉదయం వచ్చేసరికి బంగారం, నగదు దుండగులు దోచేశారు. 20 కాసుల బంగారం, 4 కేజీల వెండి, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్టు గుర్తించి లబోదిబోమంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Theft

Leave a Reply