యువకుని గల్లంతు..
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కోటపెల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన దాగం శ్రీశైలం(Dagam Srisailam) (25)అనే యువుకుడు గ్రామ ప్రాణహిత గోదావరికీ స్నానానికి వెళ్ళిగల్లంతైన సంఘటన చోటు చేసుకుంది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన దాగం శ్రీశైలం ఈ రోజు 11గంటలకు దీపావళీ(Diwali) పండగ స్నానానికై సమీప జనగామ గ్రామ ప్రాణహిత నదికి వెళ్ళి స్నానం చేస్తూ నీటమునిగినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కోటపెల్లి ఎస్సై రాజేందర్(Kotapelli S.I. Rajender) సంఘటస్థలానికి చేరుకొని సంఘటన వివరాలు సేకరిస్తున్నారు.
