వచ్చే రెండేళ్లు కష్టపడితే… వైసీపీ జెండా ఎగరడం ఖాయం!

  • ఇప్పటికే తప్పు తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు..
  • కూటమికి ఎందుకు ఓటు వేసామని బాధపడుతున్న ప్రజలు..
  • జగన్ రాక కోసం ఎదురుచూపులు…
  • త్వరలోనే క్షేత్రస్థాయికి జగన్ మోహన్ రెడ్డి..
  • కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు..
  • ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్..

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : కూటమి పార్టీలకు ఎందుకు ఓటు వేసామా అన్న భావన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఉందని, జగన్మోహన్ రెడ్డి రాక కోసం అందరూ ఎదురు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లు కష్టపడితే ప్రతి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.

ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ కార్యవర్గ సమావేశం విజయవాడలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి మాజీ మంత్రి వేలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాసు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి కార్పొరేటర్లు, వివిధ పార్టీ కమిటీల నాయకులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ…. కోటి సంతకాలు సేకరణ జరుగుతుందని, అక్టోబర్ 10 నుండి సంతకాలు సేకరణ జరుగుతుందన్నారు. డిసెంబర్ 13వ తేదీ పార్టీ రాష్ట్ర కార్యాలయం సంతకాలు అందజేస్తామని, 16వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన సంతకాలు గవర్నర్ కి ఇస్తున్నాట్లు తెలిపారు.

కార్యక్రమంలో జగన్ పాల్గొంటారని… కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జనవరి నాటికి అన్ని మండల్లాలో కమిటీలు పూర్తి చేయాలని, ప్రతి సభ్యులు కి పార్టీ గుర్తింపు కార్డులు ఇస్తాం అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి జిల్లా , నియోజక వర్గాల పర్యటన ఉందని, ప్రతి కార్యకర్తను జగన్ మోహన్ రెడ్డి కలుస్తారన్నారు. మన ప్రభుత్వం తీసుకొని వొచ్చిన 10 మెడికల్ కాలేజ్ ని ప్రవేట్ కి కూటమి కమిషన్స్ కోసం అప్పగించే పని చేస్తోందని ఆరోపించారు. నేడు జగన్ గొప్పదనం ప్రజలకు తెలిసిందని, గత ప్రభుత్వం పథకాల పేర్లు మార్చి అరకొరగా అమలు చేస్తున్నారన్నారు.

దోచుకోవడం దాచుకోవడం మీదనే కూటమి నేతల దృష్టి ఉందన్నారు. వొచ్చే ఎన్నికల్లో జగన్ అధికారం లోని వస్తారని, రాబోయే రెండేళ్లు పార్టీ బలోపేతానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కూటమికి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారని, ఒక కుటుంబ ముందుకు వెళ్తూ నియోజకవర్గాల్లో వైస్సార్సీపీ జెండా ఎగరవేయాలని అవినాష్ పిలుపునిచ్చారు.

Leave a Reply