సాహితీ లోకానికి తీరని లోటు…

సాహితీ లోకానికి తీరని లోటు…
మోత్కూర్, ఆంధ్రప్రభ : ప్రజాకవి, రాష్ట్రీయ గీతం సృష్టికర్త అందెశ్రీ మరణం సాహిత్య లోకానికి తీరని లోటని ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్(Samel) అన్నారు.
ఈ రోజు హైదరాబాద్ లోని అందెశ్రీ నివాసంలో ఆయన పార్ధీవ దేహానికి ఎమ్మెల్యే సామెల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన(Telangana state achievement)లో కీలక పాత్ర పోషించిన మహా కవి అందెశ్రీ అని, ఆయన సేవలను ఎమ్మెల్యే సామెల్ కొనియాడారు.
