ఐక్యతను పెంపొందిస్తున్న వందేమాతర గీతం..

ఐక్యతను పెంపొందిస్తున్న వందేమాతర గీతం..

మణుగూరు, (ఆంధ్రప్రభ)
జాతీయ గీతం వందేమాతరానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా “వందేమాతరం” జాతీయ గేయాన్ని సామూహికంగా ఆలపించే కార్యక్రమం మణుగూరు లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు.. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్న వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకలు 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా జరగనున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పి నవీన్, మణుగూరు తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, పల్నాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply